
హీరో అక్కినేని అఖిల్ తాజా చిత్రం Lenin ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో భావోద్వేగ ప్రసంగం

Telugu Entertainment News : హీరో అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం Lenin ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ చేసిన భావోద్వేగ ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.
అఖిల్ మాట్లాడుతూ, “మూడేళ్లుగా నా సినిమా కోసం ఎదురు చూసిన ప్రతి అభిమానికి క్షమాపణలు. ఈసారి గుండెపై చేయి పెట్టుకుని చెబుతున్నా… నన్ను నమ్మండి. ఈ సినిమా నా తరఫున మాట్లాడుతుంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో ‘లెనిన్’ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది” అని అన్నారు. ఆయన మాటలకు అభిమానులు భారీగా చప్పట్లతో స్పందించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున అక్కినేని కూడా మాట్లాడుతూ, “ఈ సినిమాలో అఖిల్ కనిపించడు… ‘లెనిన్’ మాత్రమే కనిపిస్తాడు” అని వ్యాఖ్యానించారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.